"రాహుల్ సభ తర్వాత కాంగ్రెస్ మరింత బలపడింది. తెరాస, భాజపా కుట్రతోనే మునుగోడు ఎన్నిక తెచ్చారు. ముందస్తు ఎన్నికలు పక్కనబెట్టి మునుగోడు ఎన్నిక తెచ్చారు. తెరాస-భాజపా మధ్యే పోటీ అనే వాతావరణం తెచ్చే వ్యూహాలు పన్నుతున్నారు. కాంగ్రెస్ లేదనే వాతావరణం సృష్టించేందుకు భాజప, తెరాస యత్నాలు చేస్తున్నారు. భాజపా, తెరాస కుట్రలను తిప్పికొట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ రాజకీయ చరిత్ర అంతా ఎన్నికలతోనే ఉంటుంది. ఎన్నికల్లో గెలవకపోతే గెలిచిన వారిని పార్టీలోకి తెచ్చుకుంటారు. గతంలో మాదిరిగా పోటీచేస్తే కాంగ్రెస్ గెలిచే పరిస్థితిలేదు. అందుకే మేము ఇక ప్రతి ఎన్నికనూ సెమీఫైనల్‌గానే భావిస్తాం. మునుగోడు ఉపఎన్నికను సోనియాగాంధీ సైతం పర్యవేక్షిస్తున్నారు. గత 4 ఉపఎన్నికలకు భిన్నంగా మునుగోడు పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ నల్గొండ అందులో మునుగోడులో మరింత బలంగా ఉంది. రాజ్‌గోపాల్‌రెడ్డి పార్టీని వీడినా.... కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్నారు. రాజ్‌గోపాల్‌రెడ్డి కంటే వెంకట్‌రెడ్డి సీనియర్ నాయకుడు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాడర్ సైతం కాంగ్రెస్‌లోనే ఉంటుంది. రాజ్‌గోపాల్‌రెడ్డి ఎత్తులు వేస్తే మేము పైఎత్తులు వేస్తాం. వెంకట్‌రెడ్డిపై చండూరు సభలో వ్యాఖ్యలు బాధాకరం. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మాట్లాడారు. వెంకట్‌రెడ్డిని కలుపుకునే మునుగోడులో ముందుకు సాగుతాం. అభ్యర్థి ఎంపిక విషయంలో గతంలో చేసిన తప్పులు పునరావృతం కావు. కార్యకర్తలందరికి ఆమోదయోగ్యమైన అభ్యర్థిని బరిలో దింపుతాం." - మధుయాస్కీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్
'గతంలో మాదిరిగా పోటీచేస్తే కాంగ్రెస్ గెలిచే పరిస్థితిలేదు.. అందుకే..' - రాజ్‌గోపాల్‌రెడ్డి
Madhu yashki on Munugode Bypoll: భాజపా-తెరాస కుట్రలో భాగంగానే ముందస్తు ఎన్నికల ప్రతిపాదనను పక్కనబెట్టి... మునుగోడు ఉపఎన్నిక తెచ్చారని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ ఆరోపించారు. రాష్ట్రంలో తెరాస,భాజపా మధ్యే పోటీ ఉందనే వాతావరణం తెచ్చేందుకు రెండు పార్టీలు ఒప్పందంతో సాగుతున్నాయనన్నారు. వారి కుట్రలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. మునుగోడు ఉపఎన్నికను కాంగ్రెస్ పార్టీ సెమీఫైనల్‌గా భావిస్తుందన్న ఆయన... ఈ పరిణామాలను అధినేత్రి సోనియాగాంధీ సైతం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా... కార్యకర్తలందరికీ ఆమోదయోగ్యమైన వారిని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంటారంటున్న మధుయాస్కీతో ఈటీవీ భారత్ ప్రతినిధి తిరుపాల్‌రెడ్డి ముఖాముఖి..
Congress leader Madhu yashki goud interview on Munugode Bypoll