'హుజూర్నగర్ అంటేనే తెరాస జంకుతోంది'
తెరాసలో ఎంతో మంది నాయకులున్నా... కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని మంత్రి బాధ్యతలు అప్పగించడం ఆ పార్టీ నేతల సామర్థ్యాన్ని తెలియజేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియా ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియా
పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన తెరాస ఏడు స్థానాల్లో ఓడిపోవడంతో భయాందోళనకు గురవుతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియా అన్నారు. అధికార పార్టీలో ఉన్నా కూడా... హుజూర్నగర్ ఉపఎన్నికకు భయపడుతోందని ఎద్దేవా చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో తెరాస ఓటమి ఖాయమని, భారీ మెజార్టీతో పద్మావతి రెడ్డి గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : హుజూర్నగర్లో ఊపందుకున్న ప్రచార పర్వం...