పీఆర్సీ నివేదికకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. నివేదిక ప్రతులతో బీఆర్కే భవన్ వద్దకు వచ్చిన.. ఆ పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎస్‌ను కలుస్తామన్న పీసీసీ అధికాల ప్రతినిధులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
గణతంత్ర వేడుకరోజున సీఎం కేసీఆర్ నుంచి మంచి ప్రకటన వస్తుందేమోనని ఉద్యోగులంతా వేచిచూశారని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి అన్నారు. మంచి పీఆర్సీ ఇస్తారని ఉద్యోగులు ఆశించారన్నారు. కేవలం 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని.. కమిటీ సిఫార్సు చేయడం చాలా దారుణమన్నారు.