తెలంగాణ

telangana

ETV Bharat / city

కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కోర్ కమిటీ సమావేశం - కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం

నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమైంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్​ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించారు. కోర్​ కమిటీ సభ్యుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.

congress core committe meeting for new pcc president selection
కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కోర్ కమిటీ సమావేశం

By

Published : Dec 9, 2020, 9:12 PM IST

నూతన పీసీసీ అధ్యక్షుడు ఎంపిక ప్రధాన ఎజెండగా గాంధీభవన్‌లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్ అధ్యక్షతన సమావేశమయ్యారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, కోర్ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి కోర్ కమిటీ సభ్యుల నుంచి విడివిడిగా అభిప్రాయాలు సేరించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details