తెలంగాణ

telangana

ETV Bharat / city

ఓటేయాలంటే.. వీటిలో ఏదో ఒకటి తప్పనిసరి

సామాన్యుడు ఆటంకం లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల అధారిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు జాబితాలో పేరు ఉండి ఓటరు గుర్తింపు కార్డు లేని సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయాలను ప్రకటించింది. ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్యాయంగా 18 గుర్తింపు కార్డులను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే ఓటరు స్లిప్‌ల పంపిణీని చేపట్టిన అధికారులు... మైజీహెచ్ఎంసీ, ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ద్వారా ఓటరు స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

compulsory identity card for vote costing in ghmc elections
ఓటేయాలంటే.. వీటిలో ఏదో ఒకటి తప్పనిసరి

By

Published : Nov 30, 2020, 6:09 PM IST

ఓటేయాలంటే.. వీటిలో ఏదో ఒకటి తప్పనిసరి

ఓటరు గుర్తింపు కార్డులు లేని ఓటర్లు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఓటు వేసేందుకు మందు పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నిర్ధారణ కోసం గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. రేపటి ఎన్నికల కోసం కేవలం ఓటరు గుర్తింపు కాకుండా మరో 18 కార్డులను అనుమతిస్తున్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అథారిటీ తెలిపింది. వీటిలో ఏ ఒక్క కార్డు ఉన్నా కూడా ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చని లోకేష్ కుమార్ తెలిపారు.

వీటిలో ఏది ఉన్నా సరే..

ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్ లైసెన్స్‌, ఫోటోతో కూడిన‌ స‌ర్వీస్ ఐడెంటిటీ కార్డు, ఫోటోతో కూడిన‌ బ్యాంకు పాస్‌బుక్‌, పాన్‌కార్డు, ఆర్‌జీఐ, ఎన్‌పీఆర్‌ స్మార్ట్‌ కార్డు, జాబ్‌కార్డు, హెల్త్‌కార్డు, ఫోటోతో కూడిన పింఛ‌న్‌ డాక్యుమెంట్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం, రేషన్ కార్డు, కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం, ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటిటీ కార్డు, ఆర్మ్స్ పర్సన్స్ కార్డు, అంగవైకల్యం సర్టిఫికేట్, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల అధికార గుర్తింపు కార్డు‌, పట్టదారు పాస్‌పుస్తకాలను ఉపయోగించుకోవచ్చని ప్రకటించారు.

గూగుల్‌ మ్యాప్‌తో సహా..

ఓటరు స్లిప్‌ల‌ను ఇప్పటికే అధికారులు ఇంటింటికి చేస్తున్నారు. భౌతికంగా పంపిణీ చేయటంలో ఉండే లోటుపాట్లను దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్‌లో కూడా ఓటరు స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. మైజీహెచ్ఎంసీ యాప్‌లో ఓటరు స్లిప్‌తోపాటు పోలింగ్ బూత్ వివరాలు పొందుపరిచారు. యాప్‌లో నో-యువర్ పోలింగ్ స్టేషన్ అప్షన్ క్లిక్ చేసి... ఓటరు పేరు, వార్డు పేరు ఎంటర్ చేస్తే ఓటరు స్లిప్ వస్తుంది. దీంతో పాటు పోలింగ్ బూత్ ఎక్కడ ఉందో గూగుల్ మ్యాప్ లొకేషన్ వచ్చేలా ఏర్పాటు చేశారు. పేరుకు బదులుగా ఓటర్ గుర్తింపు కార్డ్ నెంబర్, వార్డు పేరు ఎంటర్ చేసినా... ఓటర్ స్లిప్, పోలింగ్ కేంద్రం గూగుల్ మ్యాప్ వస్తుందని తెలిపారు. దీంతో పాటు ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి కూాడా ఓటర్ స్లిప్ పొందవచ్చని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:బల్దియా పోరుకు చురుగ్గా ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details