పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రకటనల ఆమోదం, చెల్లింపు వార్తల పరిశీలన కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటయింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లో ప్రచురితమయ్యే, ప్రసారమయ్యే వార్తలను పరిశీలించి పెయిడ్ న్యూస్‌కు అడ్డుకట్ట వేయనున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రకటనల ఆమోదానికి కమిటీలు - telangana Graduate MLC Elections 2021
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రకటనల ఆమోదం, చెల్లింపు వార్తల పరిశీలన కోసం కమిటీలు ఏర్పాటు చేశారు. పెయిడ్ న్యూస్‌కు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటయింది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రకటనల ఆమోదానికి కమిటీలు
ఎన్నికల ప్రకటనలకు ఆమోదం తెలిపేందుకు మరో కమిటీ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అదనపు ఎన్నికల ప్రధానాధికారి జ్యోతిబుద్ధ ప్రకాశ్ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటయింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. అన్ని రకాల ప్రకటనలకు కమిటీ అనుమతి తప్పని సరి అని సీఈఓ శశాంక్ గోయల్ ఉత్తర్వులు జారీ చేశారు.