తెలంగాణ

telangana

ETV Bharat / city

కుప్పకూలిన వేలాడే వంతెన.. నదిలో పడ్డ 30 మంది విద్యార్థులు - కూలిన వంతెన

అసోంలో వేలాడే వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 30 మంది విద్యార్థులు గాయపడ్డారు. సింగ్లా నదిని దాటుతుండగా వంతెన అకస్మాత్తుగా కూలి.. విద్యార్థులు నదిలో పడిపోయారు.

Hanging bridge collapsed
Hanging bridge collapsed

By

Published : Oct 5, 2021, 7:16 PM IST

అసోంలోని కరీంగంజ్ జిల్లాలో వేలాడే వంతెన కూలిపోవడంతో 30 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

జిల్లాలోని రతబరి అసెంబ్లీ నియోజకవర్గంలోని చెరగి ప్రాంతంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. చెరగి ప్రాంతాన్ని అనుసంధానించి సింగ్లా నదిపై వేలాడే వంతెనను మూడేళ్ల క్రితం నిర్మించారని గ్రామస్థులు తెలిపారు. చెరగిలోని ఓ పాఠశాల విద్యార్థులు సింగ్లా నదిని దాటుతుండగా వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. విద్యార్థులు నదిలో పడిపోగా.. స్థానికులు రక్షించారు.

ఇదీ చూడండి:ఒక్కడే 75 మందిని పెళ్లాడి.. 200 మంది అమ్మాయిల్ని...

ABOUT THE AUTHOR

...view details