తెలంగాణ

telangana

ETV Bharat / city

నియంత్రిత పంటల సాగుపై 21న సీఎం సమావేశం - 21న వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం సమీక్ష

నియంత్రిత పంటల సాగుపై ఈనెల 21న సీఎం అధ్యక్షతన సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లో మంత్రులు, కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో సీఎం భేటీ కానున్నారు. పంటల మ్యాప్‌పై సీఎం ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో చర్చించి.. ఎక్కడ ఏ పంట వేయాలో నిర్ణయం తీసుకోనున్నారు.

REVIEW ON AGRICULTURE
నియంత్రిత పంటల సాగుపై 21న సీఎం సమావేశం

By

Published : May 19, 2020, 12:39 PM IST

నియంత్రిత పంటల సాగుపై ఈనెల 21న సీఎం అధ్యక్షతన సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లో మంత్రులు, కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో సీఎం భేటీ కానున్నారు. జిల్లాల వారీగా సాగు చేయాల్సిన పంటలపై చర్చించనున్నారు. ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే అంశాన్ని ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేసింది.

ఈరోజు,రేపు.. వ్యవసాయ, వర్సిటీ అధికారులతో వ్యవసాయశాఖ మంత్రి సమీక్షించనున్నారు. జిల్లాల వారీగా ఏ పంట ఎంత వేయాలి అనే దానిపై నివేదిక సిద్ధం చేయనున్నారు. వరిలో ఏ రకం విత్తనం ఎక్కడ, ఎంత వేయాలి? అనే అంశాలను ఖరారు చేస్తారు. జిల్లాల వారీగా పంటల మ్యాప్​లను కూడా రూపొందించనున్నారు.

పంటల మ్యాప్‌పై సీఎం ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో చర్చించి.. ఎక్కడ ఏ పంట వేయాలో నిర్ణయం తీసుకోనున్నారు.

ఇవీ చూడండి:కేంద్రం ప్యాకేజీ డొల్ల... ముఖ్యమంత్రి గుస్సా

ABOUT THE AUTHOR

...view details