'రాష్ట్రం సుభిక్షంగా ఉండాలె తల్లీ' - 'రాష్ట్రం సుభిక్షంగా ఉండాలె తల్లీ'
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాల పండుగ వైభవంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. బంగారు తెలంగాణ సార్ధకం కావాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు సీఎం తెలిపారు.
cm kcr visited mahankali ammavari temple and prayed for the state and telangana people
ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. కారు దిగినప్పటి నుంచి అమ్మవారి గర్భాలయం వరకు స్వయంగా కేసీఆరే పట్టువస్త్రాలు తలపై పెట్టుకుని మోసుకుని వెళ్లారు. ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలని, వానలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం పచ్చదనంతో విరాజిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు సీఎం తెలిపారు.
- ఇదీ చూడండి : పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్