తెలంగాణ

telangana

ETV Bharat / city

'ధైర్యముంటే తేదీ ఖరారు చేయండి.. అసెంబ్లీ రద్దు చేస్తా..' - CM KCR challenge to oppositions

CM KCR on Early elections: రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు రానుందనే ప్రచారంపై సీఎం కేసీఆర్​ స్పందించారు. విపక్షాలు ముందస్తుకు సిద్ధమైతే.. అసెంబ్లీని రద్దు చేయడానికి తాను కూడా సిద్ధమేనని సవాలు విసిరారు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్​, భాజపాకు ముందస్తుకు వెళ్లే ధైర్యముందా..? అని ఎద్దేవా చేసారు.

CM KCR statements on Early elections in telanagana
CM KCR statements on Early elections in telanagana

By

Published : Jul 10, 2022, 9:09 PM IST

Updated : Jul 10, 2022, 10:04 PM IST

'ధైర్యముంటే తేదీ ఖరారు చేయండి.. అసెంబ్లీ రద్దు చేస్తా..'

CM KCR on Early elections: కేంద్రంలోని భాజపా ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం లేదని.. ఒడించేది, గెలిపించేది ప్రజలని.. వ్యక్తులు కాదని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని విపక్షాలు ముందస్తుకు సిద్ధమైతే.. తాను కూడా అసెంబ్లీని రద్దు చేస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్​... ముందస్తు ఎన్నికలపై స్పందించారు. తేదీ ఖరారు చేస్తే.. అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకెళ్తామని విపక్షాలకు సీఎం కేసీఆర్​ సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్‌కు ముందస్తుకు వెళ్లే ధైర్యం ఉందా..? అని కేసీఆర్​ ఎద్దేవా చేశారు.

అధికారం కోసం ఏక్‌నాథ్‌ శిందేలను పుట్టించాలా? అని భాజపాను కేసీఆర్​ ప్రశ్నించారు. మున్ముందు ఏక్‌నాథ్‌ శిందేలే ఏకుమేకవుతారని తనదైన శైలిలో హెచ్చరించారు. తాము కుంభకోణాలు చేయలేదని.. ప్రజల కోసం మంచి పనులు చేశామన్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్తే జనాలే తమను గెలిపిస్తారని కేసీఆర్​ ధీమా వ్యక్తం చేశారు.

"భాజపాను పడగొట్టే ఉద్దేశం నాకు లేదు. అధికారం కోసం ఏక్‌నాథ్‌ శిందేలను పుట్టించాలా..? మున్ముందు ఏక్‌నాథ్‌ శిందేలే ఏకుమేకవుతారు. ప్రభుత్వాలను గెలిపించేది, ఓడించేది ప్రజలు.. వ్యక్తులు కాదు. ఒకవేళ వ్యక్తులనుకుంటే.. వాళ్లు వెర్రివెంగళప్పల కింద లెక్కగట్టాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యంలో నేను ఓడిస్తా అనే మాట మాట్లాడొచ్చా.? రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్‌కు ముందస్తుకు వెళ్లే ధైర్యం ఉందా..? దమ్ముంటే తేదీ ఖరారు చేయమనండి.. నేనే అసెంబ్లీ రద్దు చేస్తా..! ఇలాంటి కురస మాటలతో కేసీఆర్​ను కొట్టలేరు."-సీఎం కేసీఆర్​

ఇవీ చూడండి:

Last Updated : Jul 10, 2022, 10:04 PM IST

ABOUT THE AUTHOR

...view details