కరోనా నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాల్లో విధించిన కోత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆర్టీసీపై రావాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎండీ సునీల్ శర్మ, ఈడీలతో సీఎం సమావేశమయ్యారు. ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై సమావేశంలో చర్చించారు.
ఆర్టీసీ ఉద్యోగులకు కోతలు తిరిగి చెల్లించాలని సీఎం ఆదేశం - ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
14:25 November 15
ఆర్టీసీ ఉద్యోగులకు కోతలు తిరిగి చెల్లించాలని సీఎం ఆదేశం
ఆర్టీసీ ఉద్యోగుల జీతాల్లో 2 నెలల పాటు కోత విధించిన 50 శాతం మొత్తాన్ని చెల్లించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. రూ.130 కోట్ల నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. హైదరాబాద్‌లో 50 శాతం బస్సులను పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీకి సీఎం సూచించారు.
ఆర్టీసీ ఉద్యోగుల జీతాల్లో కోత విధించిన మొత్తం చెల్లింపుపై మంత్రి పువ్వాడ అజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై సీఎం కేసీఆర్‌కు మంత్రి అజయ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: ధరణితోనే లావాదేవీలు.. ఏకకాలంలోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్