ధరణి, రిజిస్ట్రేషన్లపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష - ధరణిపై సీఎం కేసీఆర్ సమీక్ష
21:46 December 30
ధరణి, రిజిస్ట్రేషన్లపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష
ధరణి, రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమీక్షించనున్నారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో పాటు కొంత మంది జిల్లా కలెక్టర్లు కూడా సమావేశంలో పాల్గొననున్నారు. సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల కలెక్టర్లను సమావేశానికి హాజరు కానున్నారు.
ధరణి, రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ సంబంధిత అంశాలపై క్షేత్రస్థాయి పరిస్థితులను కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. క్షేత్రస్థాయిలో ఉత్పన్నమవుతున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఇదీ చదవండి :ఆస్తుల నమోదు సమయంలో ఆధార్ అడగొచ్చు: ప్రభుత్వం