తెలంగాణ

telangana

ETV Bharat / city

kcr: కరోనా విపత్కర వేళ సమ్మెకు పిలుపునివ్వడం సరికాదు: కేసీఆర్ - doctors strike in hyderabad

kcr responds on doctors strike
జూడాల సమ్మెపై సీఎం కేసీఆర్​ స్పందన

By

Published : May 26, 2021, 4:20 PM IST

Updated : May 26, 2021, 5:38 PM IST

16:19 May 26

kcr: కరోనా విపత్కర వేళ సమ్మెకు పిలుపునివ్వడం సరికాదు: కేసీఆర్

జూనియర్ వైద్యుల సమ్మె పిలుపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ఇటువంటి కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే విధుల్లో చేరాలని జూడాలకు సీఎం సూచించారు. జూనియర్ వైద్యుల పట్ల ప్రభుత్వం ఏరోజూ వివక్ష చూపలేదని... వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని అన్నారు. ఇప్పుడు కూడా జూడాల న్యాయమైన కోరికలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సీఎస్ సోమేశ్ కుమార్, వైద్య-ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ప్రగతిభవన్​లో సమావేశమైన సీఎం... రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వాక్సినేషన్ కార్యక్రమం, తదితర అంశాలపై సమీక్షించారు. 

జూనియర్ వైద్యుల నిరసన, సమ్మె పిలుపును అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జూనియర్ వైద్యులవి న్యాయమైన కోరికలు అయితే పరిష్కరించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం ఉండదన్న సీఎం కేసీఆర్... వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలి కానీ, చీటికి మాటికి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా సమయ సందర్భాలు కూడా చూడకుండా సమ్మె పేరుతో విధులు బహిష్కరించడం సరైన పద్ధతి కాదని అన్నారు. కరోనా వంటి అత్యవసర పరిస్థితుల్లో ఇటువంటి నిర్ణయాన్ని ప్రజలు హర్షించరని ముఖ్యమంత్రి అన్నారు. జూనియర్ వైద్యులకు చాలా రాష్ట్రాల్లో జూనియర్ వైద్యులకు స్టయిఫండ్​ను తెలంగాణ కంటే తక్కువగా ఇస్తున్న విషయాన్ని అధికారులు తెలిపారు. 

జూడాల సమస్యలపై ఆరా తీసిన సీఎం... వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మూడేళ్ల వైద్యవిద్య అభ్యసించి కొవిడ్ సేవల కొరకు కొనసాగుతున్న వైద్యవిద్యార్దులకు కూడా సీనియర్ రెసిడెంట్లకిచ్చే గౌరవ వేతనాన్ని అందించాలని నిర్ణయించారు. కరోనా సేవలందిస్తున్న నేపథ్యంలో జూనియర్ వైద్యులు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్​లో ఇప్పటికే అందిస్తున్న వైద్యసేవలను మరింత మెరుగ్గా అందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికే నిబంధనల మేరకు పరిహారాన్ని కూడా అందిస్తున్న నేపథ్యంలో వారి కోరిక మేరకు సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు.

ఇవీచూడండి:ktr: 'వ్యాక్సిన్​ హబ్​గా ఉన్నా.. గ్లోబల్​ టెండర్లు పిలవాల్సి వచ్చింది'

Last Updated : May 26, 2021, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details