హైదరాబాద్నెక్లెస్రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు నివాళులర్పించారు. పీవీ శత జయంత్యుత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సభాపతి పోచారం, కేశవరావు, మంత్రులు కేటీఆర్, తలసాని, ఈటల, కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, పొన్నం, ఇతర పార్టీల నేతలు, పీవీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఏడాది పొడవునా పీవీ జయంత్యుత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పీవీ నరసింహారావుకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్ - CM KCR paid tribute to PV Narasimha Rao
పీవీ నరసింహారావు చిత్రపటంకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
పీవీ నరసింహారావుకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్