తెలంగాణ

telangana

ETV Bharat / city

అన్నదాతకు అండగా ఉంటాం.. ప్రతి గింజనూ కొంటాం - రైతులకు వరాలజల్లు కురిపించిన కేసీఆర్​

రాష్ట్రంలో పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కనీస మద్ధతు ధరకు కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు​ హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. గ్రామాల్లోనే కూపన్లు ఇస్తామని.. రైతులు సహకరించాలని కోరారు. వరికోత యంత్రాలను సిద్ధం చేసేందుకు, అవసరమైన సామగ్రిని సమకూర్చుకునేందుకు రైతులను అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లుల్లో పనిచేసే బిహారీలను అవసరమైతే ప్రత్యేక రైళ్లలో రాష్ట్రానికి రప్పిస్తామని కేసీఆర్ తెలిపారు. రైస్ మిల్లర్లు కూడా కనీస మద్ధతు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలన్న కేసీఆర్​.. ఈరోజు రైస్​ మిల్లర్లతో సమావేశం కానున్నారు.

kcr on farmers
అన్నదాతకు అండగా ఉంటాం.. ప్రతి గింజనూ కొంటాం

By

Published : Mar 30, 2020, 6:10 AM IST

అన్నదాతకు అండగా ఉంటాం.. ప్రతి గింజనూ కొంటాం

యాసంగిలో పండించిన పంటల కొనుగోళ్ల విషయంలో లాక్​డౌన్ ఉన్నందున రైతులు ఎలాంటి ఆందోళనా చెందవద్దని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం కోటీ ఐదు లక్షల టన్నుల వరిధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ధాన్యం కొనుగోలు కోసం పౌరసరఫరాల సంస్థకు రూ. 25వేల కోట్లను సమకూర్చినట్లు తెలిపారు. 14 లక్షల టన్నులకు పైగా మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశం ఉందని.. కొనుగోలు కోసం మార్క్​ఫెడ్​కు రూ.3,200 కోట్ల గ్యారంటీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

కూపన్ల వారీగా..

లాక్​డౌన్​లో భాగంగా మార్కెట్ యార్డులు మూసివేసినందున గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం, మొక్కజొన్న సేకరిస్తామని సీఎం తెలిపారు. కూపన్ల ద్వారా రైతులకు సమయాలను నిర్దేశిస్తామని.. అందుకు అనుగుణంగా రైతులు పంటలు తీసుకురావాలని కోరారు. పాస్​ పుస్తకం, బ్యాంకు ఖాతా సంఖ్య తీసుకొస్తే రైతుల ఖాతాలో నగదు జమచేస్తామన్నారు.

వరికోత కోసం అవసరమైన యంత్రాలను సిద్ధం చేసేందుకు సిబ్బందికి అనుమతిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రైస్ మిల్లుల్లో పనిచేసే బిహారీలు చాలామంది సొంత రాష్ట్రానికి వెళ్లారని.. కేంద్ర, బిహార్ ప్రభుత్వాలతో మాట్లాడి వారిని రప్పిస్తామన్నారు. ధాన్యం సేకరణ కోసం అవసరమైన గోనె సంచులను కూడా సమకూరుస్తామని చెప్పారు.

రైస్​ మిల్లర్లతో సమావేశం..

దాదాపు 45 రోజుల పాటు కొనుగోళ్లు జరుగుతాయని.. కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల అధికారులతో కూడిన కమిటీ విధివిధానాలను ఖరారుచేస్తుందని సీఎం తెలిపారు. వ్యవసాయ విస్తరణాధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. కనీస మద్ధతు ధర చెల్లించి రైస్​ మిల్లర్లు కూడా ధాన్యం కొనుగోలు చేయలన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి రైస్ మిల్లర్లతో ముఖ్యమంత్రి ఇవాళ సమావేశం కానున్నారు.

ఇవీచూడండి:'అమెరికాలో లక్ష మందికిపైగా కరోనాకు బలవుతారు'

ABOUT THE AUTHOR

...view details