తెలంగాణ

telangana

ETV Bharat / city

త్వరలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేస్తాం: కేసీఆర్ - గవర్నర్​ను కలిసిన కేసీఆర్

రాష్ట్రంలో కరోనా స్థితిగతులపై గవర్నర్‌ తమిళిసైకి సీఎం కేసీఆర్ నివేదిక అందించారు. కరోనా లక్షణాలున్న ప్రతీ ఒక్కరికి పరీక్షలు చేయిస్తున్నామని, పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్సను అందిస్తున్నామని తెలిపారు. సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం భేటీ అయ్యారు. సచివాలయం శిథిలమైనందునే కొత్త దాని నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీల స్థానాలను భర్తీ చేయనున్నట్లు సీఎం చెప్పారు.

kcr
kcr

By

Published : Jul 21, 2020, 6:48 AM IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని గవర్నర్‌ తమిళిసైకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా పూర్తిస్థాయిలో చికిత్సను అందిస్తున్నామని వెల్లడించారు.

సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం భేటీ అయ్యారు. దాదాపు గంటసేవు వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కరోనా స్థితిగతులపై ఈ సందర్భంగా గవర్నర్‌కు సీఎం ఓ నివేదికను అందించారు. కరోనా లక్షణాలున్న ప్రతీ ఒక్కరికి పరీక్షలు చేయిస్తున్నామని, పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్సను అందిస్తున్నామని తెలిపారు.

త్వరలోనే ప్రారంభిస్తాం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలను ఏర్పాటు చేశామని, వెంటిలేటర్లు, మందులు, ఇతర సౌకర్యాలను కల్పించామని చెప్పారు. రాష్ట్ర సచివాలయం శిథిలమైనందునే కొత్త దాని నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. ‘

‘ఇప్పుడున్న సచివాలయ నిర్మాణం సరిగా జరగలేదు. ఇష్టారాజ్యంగా బ్లాక్‌లను కట్టారు. భారీ సమావేశాలకు వసతి లేదు. పార్కింగు నిత్య సమస్యగా మారింది. భద్రతపరంగా ఇబ్బందులున్నాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని సర్వహంగులతో కొత్త సచివాలయ నిర్మాణం చేపడుతున్నాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం’’ అని గవర్నర్‌కు సీఎం వివరించారు.

ఎమ్మెల్సీల భర్తీ

రాష్ట్రంలో గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీల స్థానాలను భర్తీ చేయనున్నట్లు సీఎం చెప్పారు. ఇప్పటికే రెండు ఖాళీగా ఉండగా మరోస్థానం వచ్చే నెలలో ఖాళీ అవుతుందని చెప్పారు. మంత్రిమండలి సమావేశంలో పేర్లను ఖరారు చేసి, గవర్నర్‌ ఆమోదానికి పంపిస్తామని వెల్లడించారు.

రాష్ట్రంలో వానాకాలం సాగుకు అద్భుతమైన స్పందన లభించిందని, హరితహారం ఉత్సాహంగా సాగుతోందని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా వైద్యపరంగా చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రికి గవర్నర్‌ పలు సూచనలు చేశారు.

బోనాల శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. కరోనా మహమ్మారి అంతమొందాలని వేడుకున్నారు.

ఇదీ చదవండి:నీటిపారుదల శాఖ జలవనరుల శాఖగా మార్పు: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details