ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారి ఆలయంలో ఈనెల 17 నుంచి దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించేందుకు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు శేషు ప్రగతి భవన్కు వెళ్లారు.
భద్రకాళీ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు.. సీఎం కేసీఆర్కు ఆహ్వానం - navaratri celebrations in warangal bhadrakali temple
ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయంలో జరిగే దేవీశరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆహ్వానం అందింది. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి, ప్రధాన అర్చకులు శేషు సీఎంను ఆహ్వానించారు.
సీఎం కేసీఆర్కు ఆహ్వానం
దేవీ నవరాత్రులకు సీఎంను ఆహ్వానించి.. గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రతిఏడు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు కరోనా కారణంగా ఈ ఏడు భిన్నంగా జరగనున్నాయి. కరోనా నిబంధనలకు లోబడి ఈ ఉత్సవాలు జరపాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.
Last Updated : Oct 16, 2020, 3:30 PM IST