ఆర్టీసీపై ఇవాళ మరోసారి సమీక్ష నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో సోమవారం విచారణ జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున వినిపించబోయే వాదనల గురించి చర్చించనున్నారు.
ఆర్టీసీపై రేపు విచారణ... ఇవాళ సీఎం సమీక్ష! - తెలంగాణ ఆర్టీసీ సమ్మె
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో సోమవారం విచారణ దృష్ట్యా ఇవాళ మరోసారి సమీక్ష నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ధర్మాసనం ముందు ప్రభుత్వం తరఫున వినిపించబోయే వాదనల గురించి చర్చించనున్నారు.
cm kcr
శనివారం ప్రగతి భవన్లో సుదీర్ఘంగా సమీక్షించిన ముఖ్యమంత్రి... సమ్మె పరిణామాలు, పర్యవసానాలు, నష్టాలు తదితర అంశాలను న్యాయస్థానానికి నివేదించాలని అధికారులకు సూచించినట్లు తెలిసింది. 5,100 బస్సుల రూట్ పర్మిట్ల నిర్ణయాన్ని సమర్థించేలా వాదనలు వినిపించాలనే అభిప్రాయం వ్యక్తమైంది.
ఇదీ చూడండి: ప్రజలు ఇబ్బంది పడుతున్నారు... సమస్య పరిష్కరించండి..!