విపక్షాలు మూస ధోరణిలో ఆరోపణలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యులు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ద్రవ్య విధానం కేంద్రం చేతుల్లో ఉంటుందన్న సీఎం.. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం గురించి సర్కారియా కమిషన్ కూడా చెప్పిందని స్పష్టం చేశారు.
రాష్ట్రాల హక్కులు హరించడంలో కాంగ్రెస్, భాజపాల పాత్ర : కేసీఆర్ - cm kcr about opposition
విపక్షాలు తప్పులు చెబితే సరిదిద్దుకుందామనుకున్నామని.. కానీ వారు నిర్మాణాత్మకంగా వ్యవహరించడం లేదని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ, సీఎం కేసీఆర్
రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో కాంగ్రెస్, భాజపాల పాత్ర ఉందని విమర్శించారు. చైనా భారత్ కంటే చాలా పేదరికంలో ఉండేదన్న ముఖ్యమంత్రి.. నూతన సంస్కరణలతో ఆ దేశం ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని తెలిపారు.