CM Jagan Wishes to Womens: మహిళలకు ఏకంగా 51 శాతం పదవులిచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌నేనని సీఎం జగన్ అన్నారు. దేశంలోనే ఇంతమంది మహిళా ప్రజాప్రతినిధులు మరెక్కడ లేరని తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఇక్కడున్న అతివలు.. మహిళా సాధికారతకు నిదర్శనమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రెండున్నరేళ్లుగా అధికారాన్ని అక్కచెల్లెమ్మల కోసమే వినియోగించామని వెల్లడించిన జగన్...రాజకీయ సాధికారత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
"రాష్ట్రంలోని ప్రతి మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సభలో నా చుట్టూ ఉన్న మహిళలంతా ప్రజాప్రతినిధులే. దేశంలోనే ఇంతమంది మహిళా ప్రజాప్రతినిధులు ఉన్న రాష్ట్రం,... మహిళలకు ఏకంగా 51 శాతం పదవులిచ్చిన ఏకైక రాష్ట్రం మనది. రాష్ట్ర మహిళలే ఇక్కడి మహిళా సాధికారతకు నిదర్శనం. రెండున్నరేళ్లుగా అధికారాన్ని అక్కచెల్లెమ్మల కోసం వినియోగించాం. రాజకీయ సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది."- సీఎం జగన్