తెలంగాణ

telangana

ETV Bharat / city

cm jagan: 'నాడు- నేడు' స్కూళ్లను ప్రజలకు అంకితం చేయనున్న సీఎం - తూర్పుగోదావరి జిల్లా సమాచారం

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం పోతవరం జడ్పీ హైస్కూల్లో రేపు జరగబోయే సభకు ఏపీ సీఎం జగన్ హాజరు కానున్నారు. నాడు - నేడు తొలిదశలో అభివృద్ధి చేసిన స్కూళ్లను ప్రజలకు ముఖ్యమంత్రి అంకితం చేయనున్నారు. విద్యాకానుక కింద పిల్లలకు కిట్లు పంపిణీ చేయనున్నారు.

cm jagan
cm jagan

By

Published : Aug 15, 2021, 8:25 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ముఖ్యమంత్రి జగన్ సోమవారం పర్యటించనున్నారు. పి.గన్నవరం మండలం పోతవరం జడ్పీ హైస్కూల్లో బహిరంగ సభ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

నాడు-నేడు కింద తొలిదశలో అభివృద్ధి చేసిన స్కూళ్లను ప్రజలకు సీఎం అంకితం చేయనున్నారు. రెండో విడత నాడు-నేడు పనులకూ అక్కడే శ్రీకారం చుట్టనున్నారు. విద్యాకానుక కింద పిల్లలకు కిట్లు పంపిణీ చేయనున్నారు.

ఇదీ చదవండి:Farmer loan waiver: రూ.50 వేలలోపు మాత్రమే మాఫీ

ABOUT THE AUTHOR

...view details