తెలంగాణ

telangana

ETV Bharat / city

ap cm jagan tirupati tour: సీఎం పర్యటనలో ఉద్యోగుల ఆందోళన

cm jagan tirupati tour: వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన కొనసాగుతోంది. తిరుపతి శ్రీకృష్ణనగర్‌లో వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను సీఎం పరిశీలించారు. వరద బాధిత కుటుంబాలతో మాట్లాడారు. తిరుపతిలో పీఆర్సీ సమస్య వెంటనే పరిష్కరించాలంటూ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు.

ap cm jagan tirupati tour
తిరుపతిలో సీఎం జగన్

By

Published : Dec 3, 2021, 11:49 AM IST

cm jagan tour in flood areas: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. తిరుపతి శ్రీకృష్ణనగర్‌లో సీఎం పర్యటించారు. వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. వరద బాధిత కుటుంబాలను పరామర్శించారు. పంట, పశువులు నష్టపోయిన రైతులతో మాట్లాడారు.

ఉద్యోగుల ప్లకార్డుల ప్రదర్శన

Employees demand PRC in Tirupati: తిరుపతి శ్రీకృష్ణనగర్‌లో సీఎం ఎదుట ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. పీఆర్సీతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులతో సీఎం జగన్​ మాట్లాడారు.‌

నెల్లూరు పర్యటనకు సీఎం

cm jagan nellore tour: తిరుపతిలో పర్యటన అనంతరం నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం జగన్​ పరిశీలిస్తారు. రేణిగుంట నుంచి హెలికాప్టర్‌ ద్వారా నెల్లూరులోని పోలీసు కవాతు మైదానానికి చేరుకుని.. దేవరపాళెంలో దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలను పరిశీలిస్తారు. జొన్నవాడ, పెనుబల్లిలో పెన్నా వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను, వ్యవసాయ పంటలు, రహదారులు, ఇసుక మేటలు వేసిన వరి పొలాలను పరిశీలించనున్నారు.

ఇవాళ మధ్యాహ్నం 1.15 గంటలకు వరద ముంపునకు గురైన నెల్లూరు భగత్‌సింగ్‌ కాలనీకి చేరుకుని బాధితులతో మాట్లాడనున్నారు. 2.05 గంటలకు నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో వరద నష్టాలపై అధికారులు ఏర్పాటు చేసిన పొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించి.. అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. అనంతరం 2.45 గంటలకు పోలీసు కవాతు మైదానానికి చేరుకుని రేణిగుంటకు బయలుదేరి వెళతారు.

ABOUT THE AUTHOR

...view details