CM Jagan review on floods: వరదతో నష్టపోయిన 95 వేల కుటుంబాలకు పూర్తిస్థాయిలో సాయం అందించాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇల్లు పూర్తిగా దెబ్బతింటే రూ.95 వేల పరిహారంతోపాటు... కొత్త ఇంటి నిర్మాణానికి రూ.లక్షా 80 వేల సాయం చేయాలని చెప్పారు. వరద ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పశువులు చనిపోతే పరిహారం అందించాలని, పశువులకు దాణా పంపిణీ చేయాలని నిర్దేశించారు. సహాయ కార్యక్రమాలను కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.
CM Jagan review on floods: 'వరదలతో నష్టపోయిన కుటుంబాలకు పూర్తి సాయం'
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమీక్ష (CM Jagan review on floods) నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. వరద సాయం, రోడ్ల మరమ్మతు అంశాలపై ఆరా తీశారు. విద్యుత్ పునరుద్ధరణ ఎంతవరకు వచ్చిందనే విషయాన్ని సీఎం తెలుసుకున్నారు.
రోడ్ల పునరుద్ధరణపై అధికారులు(Heavy rains in AP) వెంటనే నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుత వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని... రాజంపేట సమీపంలోని అన్నమయ్య ప్రాజెక్టును రీ-డిజైన్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని సాగునీటి ప్రాజెక్టులపై వెంటనే నివేదికలు కోరిన ముఖ్యమంత్రి.. ఈ నెల 26 నుంచి మళ్లీ వర్షాలు వస్తాయనే హెచ్చరికలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి:BJP ATTACK BC BHAVAN: బీసీ భవన్ ముట్టడికి భాజపా యత్నం.. అరెస్టు చేసిన పోలీసులు