Milan-2022: విశాఖ చరిత్రలో నిలిచిపోయే విధంగా మిలాన్ వేడుకలు జరుగుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విశాఖ తీరంలో జరుగుతున్న మిలాన్ వేడుకలకు హాజరైన సీఎం.. వేడుకల్లో 39 దేశాలు పాల్గొంటున్నాయని తెలిపారు. 'ఐఎన్‌ఎస్ విశాఖ', 'ఐఎన్‌ఎస్ వేల' చేరికతో సాగర రక్షణలో మరో అధ్యాయం మొదలైందన్నారు. విన్యాసాలతో సైనిక శక్తిపై మరింత విశ్వాసం పెంపొందుతుందని జగన్ వెల్లడించారు.
"విశాఖ చరిత్రలో నిలిచిపోయే విధంగా మిలాన్ వేడుకలు జరుగుతున్నాయి. మిలాన్ వేడుకల్లో 39 దేశాలు పాల్గొంటున్నాయి. నౌకాదళ విన్యాసాలకు విశాఖ సాగరతీరం వేదికైంది. ఐఎన్‌ఎస్ విశాఖపట్నం నౌక ఇటీవలే నౌకాదళంలో చేరింది. నౌకపై లైట్ హౌస్, డాల్ఫిన్ నోస్, కృష్ణ జింకను చిత్రించారు. ఇటీవలే 'ఐఎన్‌ఎస్ వేల' సబ్‌మెరైన్ నౌకాదళంలో చేరింది. సబ్‌మెరైన్ రాకతో ఈ ప్రాంత రక్షణలో మరో అధ్యాయం మొదలైంది. నౌకల విన్యాసాలు విశాఖ ప్రజలకు ఉత్సాహం ఇస్తాయి. విన్యాసాలతో సైనిక శక్తిపై మరింత విశ్వాసం పెంపొందుతుంది." -ముఖ్యమంత్రి జగన్
అంతర్జాతీయ సిటీ పరేడ్..