ఏపీలో గులాబ్ తుపాను బాధిత రైతుల(compensation for Gulab cyclone victims in AP)కు.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(AP CM jagan mohan reddy) రూ.22 కోట్ల నిధులు విడుదల చేశారు. పంటలు దెబ్బతిన్న 34,586 మంది రైతులకు ఈ సాయాన్ని అందజేయాలని సూచించారు. రాష్ట్రంలో 62 శాతం జనాభా.. రైతు వృత్తిలోనే ఉన్నారని సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వ ప్రతి అడుగూ విప్లవాత్మక అడుగుగా మిగిలిపోతుందని ఉద్ఘాటించారు. అన్నదాతలకు అన్నివిధాలా మంచి జరగాలని పనిచేస్తున్నట్లు వివరించారు.
AP CM JAGAN : ఏపీలో గులాబ్ తుపాను బాధిత రైతులకు రూ.22 కోట్లు - ఏపీ గులాబ్ తుపాను బాధిత రైతులకు పరిహారం
ఏపీలో గులాబ్ తుపాను(Gulab cyclone victims) బాధిత రైతులకు.. ఆ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి(AP CM jagan mohan reddy) పెట్టుబడి రాయితీ నిధులను విడుదల చేశారు. పంట దెబ్బతిన్న 34 వేల 586 మంది రైతుల కోసం రూ.22 కోట్లు రూపాయలను పరిహారం(compensation for Gulab cyclone victims in AP) కింద అందించారు. ఖరీఫ్ ముగిసేలోగా ఈ డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేయాలని సూచించారు.
AP CM JAGAN
తుపానులు, వరదలు, కరవు వచ్చినా.. రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే పరిహారం అందిస్తున్నట్లు ఏపీ సీఎం జగన్(AP CM jagan mohan reddy) తెలిపారు. నష్టం వస్తే అదే సీజన్ ముగిసేలోగా పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో గులాబ్ తుపాను కారణంగా నష్టపోయిన 34 వేల 586 మంది రైతులకు రూ.22 కోట్లు పరిహారాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు.