ఆంధ్రప్రదేశ్‌లో ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్‌లను నిలిపివేయాలని కోరుతూ కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ముఖ్యమంత్రి జగన్ బుధవారం లేఖ రాశారు. ఏపీలో మొత్తం 132 వెబ్సైట్లు ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌కు కారణం అవుతున్నాయని సీఎం లేఖలో పేర్కొన్నారు. వీటి వినియోగాన్ని ఏపీలో నిలిపివేసేలా ఇంటర్ నెట్ సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించాలని కోరారు.
ఏపీ గేమింగ్ చట్టం 1974ను సవరించి ఏపీలో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్‌లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రికి లేఖ ద్వారా సీఎం తెలిపారు. 2020 సెప్టెంబర్ 25న ఈ సవరణ ఆర్డినెన్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసినట్టు వివరించారు. ఈ చట్టం మేరకు ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ నిర్వహించే వారు శిక్షార్హులని పేర్కొన్నారు.