తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రతిపక్షాల గొంతునొక్కి బిల్లులు పాస్​ చేసుకున్నారు: భట్టి

శాసనసభలో కనీస సంప్రదాయాలు పాటించలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల కోసం కాకుండా... బిల్లులు పాస్ చేసుకోవాడానికే సభ నిర్వహించారని ధ్వజమెత్తారు.

clp leader bhatti vikramarka fire on government for conducting assembly sessions
ప్రతిపక్షాల గొంతునొక్కి బిల్లులు పాస్​ చేసుకున్నారు: భట్టి

By

Published : Oct 13, 2020, 4:57 PM IST

అసెంబ్లీలో సభాపతి ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వకుండా గొంతునొక్కి బిల్లులు ఆమోదింపచేసుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. శాసనసభలో కనీస సంప్రదాయాలు పాటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా అవసరాల కోసం కాకుండా ప్రభుత్వ అవసరాల కోసమే మాత్రమే సభ పెట్టారని ఆరోపించారు.

సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు భట్టి చెప్పారు. అసెంబ్లీ పెట్టి ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వాళ్లకు కావాల్సిన బిల్లులు పాసు చేసుకున్నారని ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్‌ వల్ల ప్రజల్లో అనేక సమస్యలు తలెత్తున్నాయని... భూసర్వే రాష్ట్ర వ్యాప్తంగా చేసిన తర్వాతనే ధరణిలో భూములను నమోదు చేస్తామని సీఎం మాట ఇచ్చి తప్పారని విమర్శించారు.

ఇదీ చూడండి:శాసనసభ నిరవధిక వాయిదా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details