శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(CJI Justice NV Ramana) దంపతులు దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలానికి చేరుకున్న జస్టిస్ రమణ దంపతులకు నందిని కేతన్ అతిథి గృహం వద్ద.. ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం, పూల మొక్కలు అందజేశారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
CJI Justice NV Ramana: శ్రీశైలం సందర్శనలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ - cji justice nv ramana
శ్రీశైలం మల్లన్న స్వామి సేవలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ(CJI Justice NV Ramana) దంపతులు పాల్గొన్నారు. జస్టిస్ ఎన్వీ రమణకు పూర్ణకుంభంతో ఆలయ ఈవో, అర్చకులు స్వాగతం పలికారు.
అనంతరం సీజేఐ(CJI Justice NV Ramana) దంపతులు స్వామి, అమ్మవార్ల దర్శనం చేరుకున్నారు. అర్చకులు జస్టిస్ ఎన్వీ రమణ(CJI Justice NV Ramana) దంపతులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. జస్టిస్ రమణతో పాటు సుప్రీంకోర్టు రిజిష్ట్రార్ రాజేష్ కుమార్ గోయల్ స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీశైలం వెళ్లే దారిలో జస్టిస్ ఎన్వీ రమణ.. నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ అటవీశాఖ క్యాంపు కార్యాలయంలో కొద్దిసేపు ఆగారు. జిల్లా కలెక్టర్ శర్మన్, జిల్లా ఎస్పీ సాయిశేఖర్ వారికి స్వాగతం పలికారు. అచ్చంపేట సివిల్ కోర్టు న్యాయవాదులు అచ్చంపేట ఏజెన్సీ కోర్టు కావాలని సీజేఐకి వినతిపత్రం అందజేశారు. న్యాయవాదుల వినతికి జస్టిస్ ఎన్వీ రమణ సానుకూలంగా స్పందించారు. అనంతరం శ్రీశైలం దేవస్థాన దర్శనానికి బయలుదేరారు.