Palamuru Rangareddy Lift Irrigation Scheme : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం మరో ధర్మాసనానికి బదిలీ చేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అవకతవకలు జరిగాయంటూ నాగం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
పాలమూరుపై పిటిషన్ వేరే ధర్మాసనానికి బదిలీ
Palamuru Rangareddy Lift Irrigation Scheme పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై దాఖలైన పిటిషన్‌ను వేరే ధర్మాసనానికి బదిలీ చేస్తూ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేసి విచారణ జాబితాలో చేర్చాలని సీజేఐ రిజిస్ట్రీని ఆదేశాలు జారీ చేశారు.
జస్టిస్ ఎన్వీ రమణ
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుటకు ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. దీన్ని మరో ధర్మాసనానికి బదిలీ చేసి విచారణ జాబితాలో చేర్చాలని సీజేఐ రిజిస్ట్రీని ఆదేశించారు.
ఇవీ చదవండి..Plantation సరికొత్త ఆలోచనలతో మొక్కల పెంపకం