తెలంగాణ

telangana

ETV Bharat / city

చీరాల దళిత యువకుడు మృతి....దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం

తూర్పుగోదావరి జిల్లా శిరోముండనం ఘటన వివాదం ఇంకా సద్దుమణగముందే.. మరోసారి ఏపీ పోలీసులు వివాదంలో చిక్కుకున్నారు. చీరాలలో దళిత యువకుడు మృతి ఘటనతో పోలీసుశాఖ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కొట్టడం వల్లే యువకుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మద్యం సేవించి, బహిరంగంగా తిరుగుతుండటంపై అదుపులోకి తీసుకోగా.. జీపు నుంచి దూకడంతో తలకు గాయమై చనిపోయాడని పోలీసులంటున్నారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/22-July-2020/8125908_794_8125908_1595411453679.png
http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/22-July-2020/8125908_794_8125908_1595411453679.png

By

Published : Jul 22, 2020, 5:22 PM IST

లాక్​డౌన్‌లో ప్రజలు మాస్కులు లేకుండా బయట తిరగకూడదన్నది పోలీసుల నిత్యం చేస్తున్న ప్రకటన. అందులో చీరాలలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్​డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 18న చీరాల రెండో పట్టణ పోలీస్​స్టేషన్​ పరిధిలో కొత్తపేట చెక్‌పోస్టు వద్ద జరిగిన సంఘటన తీవ్రవివాదాస్పదమైంది.

అబ్రహం, కిరణ్‌కుమార్‌ అనే ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వస్తుండగా చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు ఆపి, మాస్క్​ ఎందుకు పెట్టుకోలేదని నిలదీశారు. ఈక్రమంలోనే యువకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని కానిస్టేబుళ్లు ఎస్సై విజయకుమార్​కు తెలియజేశారు. తర్వాత వారిద్దరినీ జీపులో ఎక్కించుకుని వెళ్లారు. అనంతరం కిరణ్‌కుమార్‌కు తీవ్రంగా గాయాలయ్యాయని, అపస్మారక స్థితిలో ఉన్నాడని కుటుంబ సభ్యులకు సమాచారం రావడంతో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, మంగళవారం రాత్రి కిరణ్ మరణించాడు.

జీపు నుంచి దూకడంతో గాయాలు : చీరాల డీఎస్పీ

పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే కిరణ్‌కుమార్‌ మృతి చెందాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం ఇద్దరూ మద్యం సేవించి ఉన్నారని, అబ్రహం బ్రీత్‌ ఎనాలిస్‌లో 121 పాయింట్లు రీడింగ్‌ వచ్చిందని, కిరణ్‌ కుమార్‌ బ్లడ్‌ సాంపిల్స్ కూడా తీస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అదుపులో తీసుకుని జీపులో స్టేషన్ కు తరలిస్తుండగా, కిరణ్‌ కుమార్‌ భయంతో జీపు నుంచి దూకేశాడని.. దీంతో అతని తలకు బలమైన గాయమైందని పేర్కొన్నారు. అపస్మారక స్థితిలో ఉండగా చికిత్స కోసం గుంటూరు తరలించామని పోలీసుల చెబుతున్నారు.

ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఏమన్నారంటే...

దళిత యువకుడు కిరణ్‌కుమార్‌ మృతితో ప్రజా సంఘాలు రంగంలోకి దిగాయి. ప్రతిపక్ష పార్టీలు పోలీసుల దౌర్జాన్యాలపై విమర్శలు సంధించాయి. విమర్శలు, ఆరోపణలు తీవ్రస్థాయిలో రావడంతో ప్రభుత్వం నివారణ చర్యలకు ఉపక్రమించింది. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో స్వయంగా మాట్లాడి సంఘటనపై వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. గుంటూరు అదనపు ఎస్పీ గంగాధర్‌ను దర్యాప్తు అధికారిగా నియమించగా, కేసు దర్యాప్తును దర్శి డిఎస్పీకి అప్పగించారు. మృతుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందించేందుకు సీఎం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. గుంటూరులో ఉన్న కిరణ్ మృతదేహాన్ని చీరాల తీసుకువచ్చే ఏర్పాట్లులో ఉన్నట్లు చెప్పారు. ఘటనపై ఆందోళనలు తీవ్రతరం కాకుండా ఉండేందుకు ముందస్తుగా పోలీసులను భారీగా మోహరించారు.

ప్రజాసంఘాలు ఆందోళన

ఆందోళన చేసేందుకు సిద్ధం అవుతున్న ప్రజా సంఘాల ప్రతినిధులతో పోలీసులు ఉన్నతాధికారులు స్వయంగా మాట్లాడి, కిరణ్‌కుమార్‌ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. తక్షణం పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా సంఘాలు మాత్రం ఈ ఘటనపై పోరాటం తీవ్రతరం చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. పోలీసుల కొట్టిన దెబ్బలకే కిరణ్ మృతి చెందాడని, పరిహారంగా రూ.కోటి రూపాయలు, బాధితుని కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏపీలో ప్రజాప్రతినిధులు, న్యాయవాదులుకు కూడా రక్షణ లేకుండా పోతుందని విమర్శిస్తున్నారు.

ఇదీ చదవండి :మాస్క్ వివాదం: చీరాల ఎస్సై దాడిలో యువకుడు మృతి

ABOUT THE AUTHOR

...view details