చిలుకూరు అటవీ ప్రాంతంలో ఫీనిక్స్ స్వచ్చంద సంస్థ హరితహారం చేపట్టింది.మంత్రులు మల్లారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఎస్.కె.జోషి మొక్కలు నాటారు. చిలుకూరు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ లో అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ఫీనిక్స్ సంస్థ ఛైర్మన్ సురేష్ తెలిపారు. 150 ఎకరాల్లో పది వేలకుపైగా మొక్కలు నాటినట్లు తెలిపారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్ శోభ, సెక్యూరిటీ వింగ్ ఐజీ ఎం.కె.సింగ్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి పలువురు అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
చిలుకూరులో హరితహారం
తెలంగాణకు హరితహారంలో భాగంగా చిలుకూరులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వాధికారులు మొక్కలు నాటారు.
చిలుకూరులో హరితహారం