తెలంగాణ

telangana

ETV Bharat / city

Child marriages in Telangana : షాదీముబారక్​ నగదు కోసం.. పథకం ప్రకారం పెళ్లి - child marriages in lockdown

వరకట్నమా(dowry in installments)... వాయిదా పద్ధతుల్లో చెల్లించండి.. షాదీముబారక్‌ పథకం(shaadi mubarak scheme money) డబ్బులు వస్తాయిగా అప్పుడు ఇవ్వండి.. అంటూ అబ్బాయి కుటుంబం ఆఫర్లు ప్రకటిస్తుండటంతో అమ్మాయిల తల్లిదండ్రులు తొందరపడుతున్నారు. ఎక్కువమందిని పిలిచి భోజనం పెట్టలేం.. ఫంక్షన్‌హాల్‌లో, వైభవంగా పెళ్లి చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నాం.. ఎప్పటికైనా చేయాల్సిందే కదా అనుకుంటూ బాలికలను వివాహ బంధంలో(child marriage)కి నెట్టేస్తున్నారు. హైదరాబాద్​లోని ఓల్డ్​సిటీలో బడికెళ్లే బాలికల దయనీయ పరిస్థితి ఇది.

Child marriages in Telangana
Child marriages in Telangana

By

Published : Nov 18, 2021, 8:23 AM IST

కరోనా వ్యాప్తి(corona pandemic)తో రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్(lockdown) ఎందరో జీవితాలను దుర్భరంగా మార్చింది. కొందరి ప్రాణాలు తీస్తే.. మరికొందరికి జీవనోపాధిని దూరం చేసింది. ఇంకొందర్ని జీవచ్ఛవాలుగా మార్చింది. లాక్​డౌన్​తో పాఠశాలలు మూతపడటం వల్ల విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో చాలా మంది తమ ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశారు. ఎప్పటికైనా చేయాల్సిందే కదా అనుకుంటూ బాలికలను వివాహ బంధంలోకి నెట్టేశారు. లాక్‌డౌన్‌ కాలంలోనే ఓల్డ్​సిటీలో సుమారు 250 వరకు బాల్య వివాహాలు(child marriages in lockdown) జరగగా ప్రస్తుతమూ హైదరాబాద్​లోని ఓల్డ్​సిటీ మురికివాడల్లోని పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు స్వచ్ఛంద సంస్థల సర్వేలో వెల్లడైంది. సమాచారం అందగానే సంస్థల ప్రతినిధులు అడ్డుకుంటున్న సందర్భాలూ ఉన్నాయి.

నిస్సహాయ స్థితిలో..

పాతనగరంలోని మురికివాడల్లోనివారి పరిస్థితి దుర్భరం. కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయి(lost employment due to corona) కుటుంబాన్ని పోషించేందుకు పలువురు నానా తిప్పలు పడ్డారు. ఇరుకైన గదుల్లో నివసించడం, 2, 3 కుటుంబాలకు కలిపి ఒకే శౌచాలయం ఉండటంతో అమ్మాయిలకు త్వరగా పెళ్లిచేసి పంపించి బాధ్యత తీర్చుకోవాలనుకుంటారు. మరోవైపు అబ్బాయి తరఫు వారు షాదీ ముబారక్‌ పథకం(shaadi mubarak scheme money) డబ్బులిస్తే చాలంటూ ఆఫర్లు ప్రకటిస్తుండటంతో కొందరు ఆధార్‌లో తమ కూతుళ్ల వయసు మార్చేసి పెళ్లి చేసి పంపేస్తున్నారు.

రూ.15 వేల-రూ.20 వేలు వసూలు..

పాతనగరం(old city i n Hyderabad)లో అనుమతులు, లైసెన్సులు లేకుండా ఆన్‌లైన్‌, మీసేవా కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ అధికారుల దాడుల్లో వెల్లడైంది. బండ్లగూడ పరిసర ప్రాంతాలలో తహసీల్దారు ఫర్హీన్‌ షేక్‌, మండల వీఆర్వోలు కృష్ణగౌడ్‌, చంద్రయ్య, చాంద్రాయణగుట్ట ఎస్సై గౌస్‌ఖాన్‌తో కలిసి 60 ఆన్‌లైన్‌ సెంటర్లపై దాడులు జరిపి నిర్వాహకులపై చర్యలు తీసుకున్నారు. కల్యాణలక్ష్మి(Kalyana lakshmi scheme), షాదీముబారక్‌(shaadi mubarak scheme) దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసేందుకు పెద్దమొత్తంలో డబ్బులు దండుకుంటున్నట్లు వెల్లడైంది. డబ్బులు మంజూరైతే రూ.15-20 వేల వరకు లబ్ధిదారుల నుంచి వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. డబ్బులు ఇవ్వని వారి దరఖాస్తులను అధికారులకు చేరకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. కొందరైతే ఏకంగా పూచీకత్తు కింద సిసలైన నిఖానామాలు(పెళ్లి ధ్రువపత్రం(marraige certificate)) తమవద్దే జమ చేసుకుంటున్నారు.

స్వచ్ఛంద సంస్థ సర్వేలో వెల్లడి..

2020 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి వరకు రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో చైల్డ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌(child protection cell) ద్వారా 1,355 బాల్య వివాహాలను అడ్డుకొన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే లాక్‌డౌన్‌ సమయంలోనే పాతనగరంలో సుమారు 250 బాల్య వివాహాలు(child marriages in lockdown) జరిగాయని షహీన్‌ ఎన్జీవో సర్వేలో వెల్లడైంది. కరోనా, వరదల ప్రభావంతో ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను సాయం అందించేందుకు సర్వే ప్రారంభించడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా ముసుగులో అనేక పెళ్లిళ్లు జరిగినా అవి బయటకు రాలేదు.

తర్వాత బాధపడుతున్నారు

"స్వచ్ఛంద సంస్థ ప్రారంభం అయిననాటి నుంచి సుమారు 200 బాల్య వివాహాలను అడ్డుకున్నాం. బాల్య వివాహం(child marriage)తో అమ్మాయిలు శారీరక, మానసిక ఇబ్బందులు పడుతున్నారు. గృహహింస కేసులు నమోదవుతున్నాయి. వరకట్న వేధింపులు(harassment for dowry) పెరిగాయి. వాల్మీకినగర్‌, హసన్‌నగర్‌, సిద్ధిఖినగర్‌, పటేల్‌నగర్‌, అమన్‌నగర్‌, భవానీనగర్‌తోపాటు తలాబ్‌కట్ట ప్రాంతంలోని 20 మురికివాడల్లో ఈ పరిస్థితి ఉంది."

ABOUT THE AUTHOR

...view details