CM KCR REVIEW ON RTC: ఆర్టీసీ ఆదాయం పెరిగే మార్గాలేమిటి..?
13:53 August 23
ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, సీఎస్, అధికారులతో చర్చిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆర్టీసీ ఆదాయం భారీగా పడిపోయింది. ప్రస్తుతం ప్రతి రోజూ రూ.9 కోట్ల ఆదాయం సమకూరుతోంది. మరో రూ.2 నుంచి రూ.3 కోట్ల ఆదాయం పెంచుకోగలితే సంస్థ ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుందని ఆర్టీసీ ఆర్థికాంశాలపై ఆదివారం సమీక్షించిన మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. సంస్థకు వస్తున్న ఆదాయంతో పాటు ఖర్చు, అప్పుల వివరాలపై సమావేశంలో చర్చించారు.
ఆర్టీసీకి బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు, ఇతర నిధులు రూ.1,500 కోట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించారని పువ్వాడ తెలిపారు. బడ్జెట్ నిధులు నెలానెలా విడుదలవుతున్నాయని పేర్కొన్నారు. బడ్జెటేతర నిధుల కింద ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల పూచీకత్తు ఇవ్వడంతో బ్యాంకు రుణం మంజూరు చేసిందని చెప్పారు. అందులో రూ.500 కోట్లు వచ్చాయని... మరో రూ.500 కోట్లు త్వరలోనే వస్తాయని వివరించారు. ఆర్టీసీ ఆదాయం పెంచే మార్గాలు, అప్పులపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీచూడండి:హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ.500 కోట్ల నిధులు