తెలంగాణ

telangana

By

Published : Aug 19, 2020, 3:24 PM IST

Updated : Aug 19, 2020, 10:15 PM IST

ETV Bharat / city

సంతోష్​ కుమార్​ విత్తన గణపతి సవాల్​ స్వీకరించిన రంజిత్ రెడ్డి

పర్యావరణ పరిరక్షణకు హరిత భారత్​లో భాగంగా ఎంపీ సంతోష్​ కుమార్​ విసిరిన విత్తన గణపతి సవాల్​ను... చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి స్వీకరించారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్వీకరించాలని కోరారు.

chevella mp ranjith reddy receive santosh kumar seed ganapathi challenge
సంతోష్​ కుమార్​ విత్తన గణపతి సవాల్​ స్వీకరించిన రంజిత్ రెడ్డి

వినాయక చవితిని పర్యావరణరహితంగా జరుపుకునేందుకు హరిత భారత్‌ సవాల్‌లో భాగంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ పంపిణీ చేస్తున్న విత్తన గణపతిని చేవేళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి స్వీకరించారు. వినాయక నిమజ్జనం అనంతరం మొలకెత్తే విత్తనాన్ని తన ఇంట్లోనే నాటనున్నట్టు ఎంపీ తెలిపారు. ఈ సవాల్​ను తన పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని గౌరవ మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ప్రజా ప్రతినిధులందరూ స్వీకరించాలని కోరారు.

సంతోష్​ కుమార్​ విత్తన గణపతి సవాల్​ స్వీకరించిన రంజిత్ రెడ్డి

సంతోష్​కు అభినందనలు

ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీఓపీ)తో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణ దెబ్బతిని, కాలుష్యం పెరుగుతుందని రంజిత్ రెడ్డి అన్నారు. పర్యావరణ పరిరక్షణకై ప్రపంచ వ్యాప్తంగా విస్తృత చర్చ కొనసాగుతున్న తరుణంలో తన సహచర రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపడుతున్న కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందని... అందుకు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.

మట్టి విగ్రహాలకే ప్రాధాన్యతనివ్వాలి

పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఎంపీ పేర్కొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని గణేష్ మండపాల్లో మట్టి వినాయక విగ్రహాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు.

Last Updated : Aug 19, 2020, 10:15 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details