విజయవాడ ఇంద్రకీలాద్రిపై చతుర్వేద హవనం శాస్త్రోక్తంగా కొనసాగుతోంది. లోక కళ్యాణార్థం, దేశ సంరక్షణార్థం ఈ కార్యక్రమాన్ని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం సంకల్పించింది.
ఇంద్రకీలాద్రిపై శాస్త్రోక్తంగా చతుర్వేద హవనం - దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం
లోక కళ్యాణార్థం, దేశ సంరక్షణార్థం... విజయవాడ ఇంద్రకీలాద్రిపై చతుర్వేద హవనం శాస్త్రోక్తంగా కొనసాగుతోంది. ఆలయ స్థానాచార్యులు, తదితరుల ఆధ్వర్యంలో మండప పూజలు, చతుర్వేద మంత్రాలతో హోమ గుండాల వద్ద హవనం చేశారు.
Sri Durga Malleswara Swamy Varla Devasthanam
ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, చింతపల్లి ఆంజనేయ ఘనపాటి, ప్రధానార్చకులు లింగంబొట్ల దుర్గాప్రసాద్ ఇతర వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మండప పూజలు, చతుర్వేద మంత్రాలతో హోమ గుండాల వద్ద హవనం చేశారు. ఈనెల 25న పూర్ణాహుతి ఈ కార్యక్రమం పరిసమాప్తమం కానుంది.