తెలంగాణ

telangana

ETV Bharat / city

సుప్రీం తీర్పు వైకాపా ఉన్మాద పాలనకు కనువిప్పు కావాలి: చంద్రబాబు

ఏపీలో పంచాయతీ ఎన్నికలపై సుప్రీం తీర్పు వైకాపా ఉన్మాద పాలనకు కనువిప్పు కావాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలని కోరారు.

chandrababu taza
సుప్రీం తీర్పు వైకాపా ఉన్మాద పాలనకు కనువిప్పు కావాలి: చంద్రబాబు

By

Published : Jan 25, 2021, 10:47 PM IST

ఆంధ్రప్రదేశ్​లో పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును తెదేపా అధినేత చంద్రబాబు స్వాగతించారు. వైకాపా పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు అన్నీఇన్నీ కావన్నారు. ప్రతి రాజ్యాంగ వ్యవస్థకూ ఆటంకం కలిగిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య మూలస్తంభాల ధ్వంసమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ప్రతి సందర్భంలోనూ కోర్టులే జోక్యం చేసుకుని న్యాయం చేయడం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం హర్షణీయమని అభిప్రాయపడ్డారు. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వైకాపా ఉన్మాద పాలనకు కనువిప్పు కావాలన్నారు.

సుప్రీం తీర్పు స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలి. నిష్పక్షపాతంగా, సజావుగా పంచాయతీ ఎన్నికలు జరపాలి. మార్చిలో స్థానిక ఎన్నికల్లో చోటుచేసుకున్న హింసా విధ్వంసాలు, తప్పుడు కేసులు- అక్రమ నిర్బంధాలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి- చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి:పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూలు చేసిన ఎస్‌ఈసీ

ABOUT THE AUTHOR

...view details