Chandrababu on CM Jagan: ఏపీలోని నెల్లూరులో మరో ఎస్సీ వ్యక్తికి జగన్ ఉరి వేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. కావలి మండలం ముసునూరులో కరుణాకర్ ఆత్మహత్యకు వైకాపా నేతల వేధింపులే కారణమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రోజుకో దళితుడు ప్రాణాలు కోల్పోతున్నాడని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల పెట్టుబడి పెట్టిన చేపల చెరువుల్లో పంట అమ్ముకోనివ్వకుండా వైకాపా నేతలు కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి, సురేశ్ రెడ్డిలు వేధిస్తున్నందుకే ప్రాణాలు తీసుకుంటున్నట్లు కరుణాకర్ లేఖ రాశాడని గుర్తు చేశారు. సమాజ శత్రువులుగా మారిన వైకాపా రాక్షసులను కట్టడి చేయడంలో అధికార పార్టీ ఎప్పుడూ ఉదాసీనంగానే వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కరుణాకర్ కుటుంబం రోడ్డున పడడానికి, ఇద్దరు పిల్లలు అనాథలు కావడానికి కారణమైన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరో ఎస్సీ వ్యక్తికి సీఎం జగన్ ఉరి వేశారన్న చంద్రబాబు - వైకాపా ప్రభుత్వంపై చంద్రబాబు కామెంట్స్
Chandrababu on CM Jagan ఏపీలో రోజుకో దళితుడు ప్రాణాలు కోల్పోతున్నాడని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరులో కరుణాకర్ అనే యువకుడి ఆత్మహత్యకు వైకాపా నేతల వేధింపులే కారణమని ఆయన ధ్వజమెత్తారు.
వైకాపా దమనకాండకు అంతులేదు: దళితులపై వైకాపా దమనకాండకు అంతు లేకుండా పోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. అధికారం అండగా వైకాపా నాయకులు అరాచకాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. వైకాపా నేతల వేధింపుల వల్లే దళిత యువకుడు దుగ్గిరాల కరుణాకర్ ప్రాణాలు కోల్పోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి మరణానికి కారకులైన వైకాపా నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. వైకాపా నేతల నుంచి దళితుల్ని రక్షించేందుకు ప్రత్యేక చట్టం తేవాల్సిన భయానక పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని అన్నారు.
ఇవీ చూడండి: