తెలంగాణ

telangana

ETV Bharat / city

మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చ

మహానాడు నిర్వహణపై తెదేపా నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. తెదేపా మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలపై చర్చించారు. రెండ్రోజులు జరిగే మహానాడులో తెదేపా పలు తీర్మానాలు చేయనుంది.

chandra babu
chandra babu

By

Published : May 25, 2021, 10:35 PM IST

మహానాడు తీర్మానాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో ఆన్​లైన్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 27, 28వ తేదీల్లో డిజిటల్ వేదికగా జరిగే ఈ వేడుకల్లో ఆమోదించే తీర్మానాలకు తుది రూపునిచ్చారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ ఏడాది డిజిటల్ వేదికగా మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు.

మహానాడులో అమరులైన పార్టీ నేతలకు, కొవిడ్ మృతులకు సంతాపం తెలుపుతూ తొలి తీర్మానం చేయనున్నారు. యుగపురుషుడు ఎన్టీఆర్​కి నివాళి అర్పించనున్నారు. కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వ వైఫల్యం, సీఎం జగన్ నిర్లక్ష్యం, ఆక్సిజన్ అందక కరోనా బాధితుల మృతి, వ్యాక్సినేషన్​లో ప్రభుత్వ చేతకానితనం తదితర అంశాలపై మహానాడులో తీర్మానాలు చేయనున్నారు.

వ్యవసాయం, సాగు నీటిపారుదల రంగాల నిర్వహణలో ప్రభుత్వ అవగాహనాలోపం, చిత్తశుద్ధి లేమి, రైతు భరోసా, ఇన్​పుట్ సబ్సిడీ పేరుతో రైతులకు ప్రభుత్వం చేస్తున్న మోసంపై తీర్మానం చేస్తారు. రెండేళ్లలో జగన్ చేతకానితనంతో చేసిన అప్పులు, పెంచిన పన్నుల కారణంగా సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఉపాధి లేమి, కొరవడిన ఆదాయం, పన్నుల భారాన్ని ఖండిస్తూ మరో తీర్మానం చేయాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో నిరుద్యోగం, అమరావతిని విచ్ఛిన్నం చేసిన విధానంపైనా తీర్మానం, నవరత్నాలు, నమ్మక ద్రోహం చేస్తున్న సంక్షేమంపై తీర్మానం, వైన్, మైన్, ల్యాండ్, శాండ్ పేరుతో పంచభూతాలను మింగేస్తున్న తీరును ఎండగడుతూ తీర్మానం చేయనున్నట్లు అధినేత తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను క్షీణింపజేసిన విధానంపైనా మహానాడు వేదికగా రాజకీయ తీర్మానం చేయాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో 3,821 కరోనా కేసులు, 23 మరణాలు

ABOUT THE AUTHOR

...view details