తెలంగాణ

telangana

ETV Bharat / city

హత్యల వెనుక.. ఆ ఎమ్మెల్యే హస్తం ఉంది: చంద్రబాబు - హత్యలు చేసిన వారిని ఉరితీయాలన్న చంద్రబాబు

"ఆస్పత్రి నుంచి జల్లయ్య మృతదేహం ఎక్కడికి తరలించారో కూడా చెప్పరా?" అని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్య చేశారని.. ఈ హత్యల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి హస్తం ఉందని ఆరోపించారు. ప్రత్యేక కోర్టు పెట్టి నిందితులకు ఉరిశిక్ష వేయాలని చంద్రబాబు డిమాండ్​ చేశారు.

chandrababu-comments-on-jallaiah-cremation
chandrababu-comments-on-jallaiah-cremation

By

Published : Jun 4, 2022, 7:50 PM IST

ఏపీలోని పల్నాడులో హత్యకు గురైన తెదేపా కార్యకర్త జల్లయ్య మృతదేహాన్ని.. ఆస్పత్రి నుంచి ఎక్కడికి తరలించారో కూడా చెప్పరా? అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిలదీశారు. సొంత గ్రామంలో దహన సంస్కారం చేసే అవకాశం కూడా ఇవ్వరా? అని ప్రశ్నించారు. ఒక్క మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్య చేశారని.. ఈ హత్యల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. ప్రత్యేక కోర్టు పెట్టి నిందితులకు ఉరిశిక్ష వేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

మరోవైపు జల్లయ్య అంత్యక్రియలకు వెళ్తున్న తెదేపా నేతల అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు కాపాడలేని పోలీసులు.. అంత్యక్రియలకు వెళ్తున్న వారిని అరెస్ట్‌ చేయడం ఏంటని ప్రశ్నించారు. కాగా.. జల్లయ్య కుటుంబానికి తెదేపా తరఫున రూ.25 లక్షల ఆర్థికసాయాన్ని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details