రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్న సీఎం కేసీఆర్.. అప్పుల తెలంగాణగా మార్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దుబ్బాక ప్రజలు కోరుకున్న మార్పు హైదరాబాద్ ప్రజలు కూడా కోరుకున్న కుటుంబ పాలనను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని సూచించారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్, అడిక్‌మెట్, గాంధీనగర్ డివిజన్లలో నిర్వహించిన రోడ్ షోలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
'కుటుంబ పాలనను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి' - Greater hyderabad elections 2020
హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్, అడిక్‌మెట్, గాంధీనగర్ డివిజన్లలో నిర్వహించిన రోడ్ షోలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. దుబ్బాక ప్రజలు కోరుకున్న మార్పు హైదరాబాద్ ప్రజలు కూడా కోరుకుంటున్న కుటుంబ పాలనను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని కిషన్‌రెడ్డి సూచించారు.
central minister kishan reddy road show in hyderabad
ఎన్నికల హామీలను అమలు చేయని తెరాస ప్రభుత్వానికి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకుని పోలింగ్ శాతాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. భాజపా అభ్యర్థులకు ఓటు వేయాలని నగరవాసులను కోరారు.