Kishan Reddy on paddy procurement: రాష్ట్ర ప్రజలను అనేక విషయాల్లో సీఎం కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిల్లీలో ఆరోపించారు. ధాన్యాన్ని ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వమే కొంటున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. బాయిల్డ్ రైసు కాకుండా ముడి బియ్యం సరఫరా చేస్తే కేంద్రం తీసుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు. వడ్లు సేకరించి రా రైస్‌గా ఇస్తే కేంద్రానికి ఏం అభ్యంతరం లేదన్నారు. కేంద్రానికి రా రైసు సరఫరా చేస్తే నూకల రూపంలో కొంత మేర నష్టం రావొచ్చని.. రైతుల కోసం ఆ మాత్రం నష్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించలేదా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం కిలో రూ.33 చొప్పున బియ్యం సేకరించి మళ్లీ ప్రజలకు రూ.3కే ఇస్తోందని వివరించారు.
Kishan Reddy on paddy: 'ఆ కొద్దిపాటి నష్టాన్ని రాష్ట్రం భరించలేదా..?' - ధాన్యం కొనుగోళ్లు
Kishan Reddy on paddy procurement: ధాన్యం కొనుగోళ్ల విషయంలో భాజపా, తెరాస నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వాస్తవాలను వక్రీకరించి తెరాస నేతలు రైతులను మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. బాయిల్డ్ రైస్ కాకుండా ముడిబియ్యాన్ని ఇస్తే తప్పకుండా తీసుకుంటామంటున్న కిషన్‌రెడ్డి.. ఈ క్రమంలో వచ్చి కొద్దిపాటి నష్టాన్ని రాష్ట్రం భరించలేదా..? అని ప్రశ్నిస్తున్నారు.
"సీఎం కేసీఆర్ లేని సమస్యను సృష్టించారు. బాయిల్డ్ రైసు ఇవ్వబోమని కేంద్రానికి కేసీఆర్ రాతపూర్వకంగా తెలిపారా లేదా? బాయిల్డ్ రైసును ఏ రాష్ట్రంలోనూ వినియోగించటం లేదు. బాయిల్డ్ రైసును ఉచితంగా పంచినా... ప్రజలు తినే పరిస్థితి లేదు. ప్రజల కోణంలోనే బాయిల్డ్ రైసు సేకరణను ఎఫ్‌సీఐ నిలిపివేసింది. వాస్తవాలను వక్రీకరించి తెరాస నేతలు ధర్నాలు చేస్తున్నారు . గత సీజన్‌లో ఇస్తామన్న బాయిల్డ్ రైసును రాష్ట్రం ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. గత సీజన్‌లో ఎఫ్‌సీఐకి 62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తామని రాష్ట్రం ఒప్పందం చేసుకుంది. అగ్రిమెంట్ ప్రకారమే ఇంకా 8.34 లక్షల టన్నుల బాయిల్డ్ రైసును ఇంకా ఎఫ్‌సీఐకి పంపలేదు. ఒప్పందం ప్రకారం పంపాల్సిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇంకా ఎందుకు ఇవ్వలేదు." - కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి
ఇదీ చూడండి: