తెలంగాణ

telangana

ETV Bharat / city

Kishan Reddy : కరోనా కట్టడిలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా భారత్ - corona cases in telangana

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలు రాజకీయాలు మానుకుని ప్రభుత్వానికి సహకరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. డిసెంబర్​ వరకు దేశంలోని ప్రతి ఒక్కరికి టీకా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

central minister kishan reddy, kishan reddy
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

By

Published : May 30, 2021, 3:53 PM IST

కరోనా వ్యాప్తిని నివారించడంలో భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ వినియోగంలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉండటం భాజపా ప్రభుత్వ పని తీరుకు నిదర్శనమని తెలిపారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం రెండో సారి ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కమలం నేత చుక్క గణేష్ ఆధ్వర్యంలో లాలాపేటలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. అనంతరం మహిళా కార్మికులకు చీరలు, ఆహార ప్యాకెట్స్ పంపిణీ చేశారు.

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలు రాజకీయాలు మానుకుని ప్రభుత్వానికి సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు దేశంలో ఉన్న ప్రజలందరికి వ్యాక్సిన్ వేసే ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. కరోనా నియంత్రణ అయ్యేవరకు ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details