తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రానికి కేంద్ర హైలెవల్​ కమిటీ.. వర్షాలతో జరిగిన నష్టంపై అధ్యాయనం..! - హోంశాఖ మంత్రి అమిత్​షా

Central High level Committee: త్వరలోనే కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి బృందం రాష్ట్రానికి రానుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసి.. కేంద్రానికి నివేదిక ఇవ్వాలని అధికారులను హోంశాఖ మంత్రి అమిత్​షా ఆదేశించినట్టు పేర్కొన్నారు.

Central High level Committee coming to study on rain damage in telangana
Central High level Committee coming to study on rain damage in telangana

By

Published : Jul 19, 2022, 8:03 PM IST

Central High level Committee: రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి బృందాన్ని పంపాలని హోంమంత్రి అమిత్​షా సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో హైపవర్ కమిటీ పర్యటించి ఇటీవల కురిసిన వర్షానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి.. కేంద్రానికి నివేదిక ఇవ్వాలని అమిత్​షా సూచించినట్టు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెల్లడించారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్‌చుగ్‌తో కలిసి అమిత్​షాను బండి సంజయ్​ కలిశారు.

రాష్ట్రంలో వరదల వల్ల సంభవించిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అమిత్​షాకు వివరించినట్లు బండి సంజయ్‌ పేర్కొన్నారు. స్పందించిన హోంమంత్రి అమిత్ షా.. వెంటనే హైవర్ కమిటీ రాష్ట్రానికి పంపాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. త్వరలోనే హైలెవల్​ కమిటీ రాష్ట్రంలో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇస్తుందన్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details