ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణానికి మాత్రమే నిధులిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. పునరావాస, పరిహార ప్యాకేజీతో తమకు సంబంధం లేదని తేల్చిచెప్పింది. 2015 నుంచి ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.8,614.16 కోట్లు ఖర్చయ్యాయి. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.950 కోట్లు మంజూరయ్యాయని.. నాబార్డు ద్వారా రూ.7,664.16 కోట్లు మంజూరైనట్లు కేంద్రం వెల్లడించింది.
పోలవరం డ్యామ్ నిర్మాణానికి మాత్రమే డబ్బులిస్తాం: కేంద్రం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన అర్జీకి సమాధానమిస్తూ వివరాలు తెలిపింది. ఆర్టీఐ ద్వారా ప్రాజెక్టు నిర్మాణం, పునరావాసం, పరిహారానికి సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
పోలవరం డ్యామ్ నిర్మాణానికి మాత్రమే డబ్బులిస్తాం: కేంద్రం
వ్యయంలో ఇంకా రూ.2,234.77 కోట్లు పెండింగ్ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటివరకు పునరావాసంతో కలిపి 41.05 శాతం మేర నిర్మాణం పూర్తయినట్టు పేర్కొంది. 71.54 శాతం మేర పోలవరం డ్యామ్ నిర్మాణం పూర్తయిందని, 19.85 శాతం మాత్రమే పునరావాస పనులు పూర్తయ్యాయని కేంద్రం వివరించింది.
ఇదీ చదవండి:తెలంగాణ-ఏపీ మధ్య అంతర్రాష్ట సేవలు ఇకనైనా ప్రారంభమయ్యేనా?