తెలంగాణ

telangana

ETV Bharat / city

old car: పాత కార్లు వాడే వారికి షాకింగ్​ న్యూస్​! - క‌మ‌ర్షియ‌ల్ వాహనాలు

పాత వాహనాలు ఉపయోగించే వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 15 ఏళ్లు దాటిన కార్లు.. 8 ఏళ్లు దాటిన క‌మ‌ర్షియ‌ల్ వాహనాల ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్‌ రెన్యూవ‌ల్‌ ఫీజును దాదాపు ఎనిమిది రెట్లు చేసినట్లు తెలుస్తోంది.

Fitness Certificate Renewal Fee
Fitness Certificate Renewal Fee

By

Published : Oct 5, 2021, 7:56 PM IST

కొత్త వాహ‌నాల కొనుగోళ్ల‌ు పెంచ‌డానికి.. పాత వాహ‌నాల వాడకాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం షాకింగ్​ నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు దాటిన కార్లు.. 8 ఏళ్లు దాటిన క‌మ‌ర్షియ‌ల్ వాహనాలు, ట్ర‌క్కులు, బ‌స్సులు ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్‌ రెన్యూవ‌ల్‌కు వెళితే దాదాపు ఎనిమిది రెట్ల ఫీజు చెల్లించాల్సిందిగా కేంద్ర రోడ్డు, ర‌వాణా మంత్రిత్వ‌శాఖ నోటిఫికేష‌న్ జారీ చేసింది. 2022 ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి ఈ నిబంధనలు అమ‌లులోకి రానున్నాయి.

2022 ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి రెన్యూవ‌ల్ ఫీజులు !

15 ఏళ్లు దాటిన‌ కార్లకు రిజిస్ట్రేష‌న్ రెన్యూవ‌ల్ ఫీజు ప్రస్తుతం రూ.600 ఉండగా.. ఏప్రిల్​ 2022 నుంచి రూ.5,000కు పెరగనుంది. బ‌స్సులు, ట్ర‌క్కులకు అయితే ఇప్పుడు రూ.1500 చెల్లించాల్సి ఉండగా.. వ‌చ్చే ఏప్రిల్ నుంచి రూ.12,500కు పెరగనుంది. వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ రెన్యూవ‌ల్ చేసుకోవడం ఆలస్యం అయితే జరిమానా తప్పనిసరి చేసింది. పాత వాహ‌నాల‌ు ప్ర‌తి ఐదేండ్ల‌కోసారి రిజిస్ట్రేష‌న్ రెన్యూవ‌ల్ చేసుకోవాలి. ఎనిమిదేళ్లు దాటిన‌ వాణిజ్య వాహ‌నాల‌కు ప్రతి సంవత్సరం ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలి.

ఇదీ చూడండి:కుప్పకూలిన వేలాడే వంతెన.. నదిలో పడ్డ 30 మంది విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details