కేంద్ర మార్గదర్శకాలను పటిష్ఠంగా అమలు చేసి కొవిడ్ వ్యాప్తి తక్కువగా ఉండేలా చూడడంతో పాటు వ్యాక్సిన్ సరఫరా కోసం కోల్డ్ చైన్, రవాణా కోసం మౌలిక వసతులు సిద్ధం చేయాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సూచించారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. కోవిడ్ నేపథ్యంలో ప్రజారోగ్య వ్యవస్థ, వ్యాక్సిన్ సన్నద్ధతపై సమీక్షించారు. పర్యవేక్షణ, కంటైన్మెంట్ తదితరాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను పూర్తి స్థాయిలో పాటించాలని రాష్ట్రాలకు గౌబ స్పష్టం చేశారు.
కేంద్ర కేబినేట్ కార్యదర్శి సమీక్షలో సీఎస్, డీజీపీ - కేంద్ర కేబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సమీక్ష
కేంద్ర కేబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబ... రాష్ట్రాల సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. కేంద్ర మార్గదర్శకాలను పటిష్ఠంగా అమలు చేసి కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ సరఫరా, రవాణాకు అవసరమైన వసతులు కల్పించాలని కోరారు.
ప్రస్తుతం ఆక్టివ్ కేసులు నాలుగున్నర లక్షల లోపే ఉన్నాయన్న కేంద్ర కేబినెట్ కార్యదర్శి... మరణాల రేటు కూడా తగ్గుతోందని వెల్లడించారు. పటిష్ఠమైన కంటైన్మెంట్, సరిపడా పరీక్షలతో కొవిడ్ వ్యాప్తి తక్కువగా ఉండేలా చూడాలన్నారు. వ్యాక్సిన్‌కు సంబంధించిన అన్ని అంశాలు రాష్ట్రాల సీఎస్‌లు సమీక్షించాలని కోరారు. డిసెంబర్ 6 లోపు రాష్ట్ర స్టీరింగ్ కమిటీతో పాటు బ్లాక్, జిల్లా, టాస్క్‌ఫోర్స్ సమావేశాలు జరిగేలా చూడాలన్న ఆయన... వివిధ వర్గాల సహకారంతో వ్యాక్సిన్ సరఫరా కోసం కోల్డ్ చైన్, రవాణాకు అవసరమైన వసతులు కల్పించాలన్నారు. ప్రాధాన్య వర్గాలకు మొదట వ్యాక్సిన్ ఇచ్చే విషయమై ప్రజల్లో సానుకూల చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చూడండి:రాహుల్ 2.0: కాంగ్రెస్‌లో మళ్లీ యువనేత జోరు!