కొవిడ్ సాయం కింద కేంద్రం నుంచి వచ్చింది శుష్కప్రియాలు, శూన్యహస్తాలే అని సీఎం కేసీఆర్ విమర్శించారు. జాతీయ హెల్త్ మిషన్ ద్వారా రూ.265 కోట్లు వచ్చాయని వెల్లడించారు. బడ్జెట్ కింద మరో రూ.90 కోట్లు ఇచ్చారని పేర్కొన్నారు. కరోనా కట్టడికి కేంద్రం చేసిన సాయంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు సీఎం బదులిచ్చారు.
కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కథలు చెబుతున్నారు : కేసీఆర్ - కేంద్రంపై సీఎం కేసీఆర్ విమర్శలు
కరోనాపై కేంద్రం మాటలు చెబుతోందని.. సాయం మాత్రం చేయట్లేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే మనకూ ఇచ్చిందని స్పష్టం చేశారు. రుణాలు రీస్ట్రక్చర్ చేయాలన్నా కేంద్రం పట్టించుకోవట్లేదన్నారు. కేంద్రమంత్రులు తెలంగాణ వచ్చి అనేక కథలు చెబుతున్నారని మండిపడ్డారు.
kcr
కేంద్రం 647 వెంటిలేటర్లు ఇచ్చిందని.. అవి కూడా బడ్జెట్ కిందే అంటోందని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే మనకూ ఇచ్చిందని స్పష్టం చేశారు. కేంద్రం మాటలు చెబుతోందని.. సాయం మాత్రం చేయట్లేదని ఆరోపించారు. రుణాలు రీస్ట్రక్చర్ చేయాలన్నా కేంద్రం పట్టించుకోవట్లేదన్నారు. కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి అనేక కథలు చెబుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు.