తెలంగాణ

telangana

ETV Bharat / city

కేసీఆర్‌ ప్రభుత్వ అక్రమాలకు కేంద్రం సహకరిస్తోంది: రేవంత్‌ రెడ్డి - రేవంత్ రెడ్డి వార్తలు

Revanth Reddy on KCR: కేసీఆర్‌ ప్రభుత్వ అక్రమాలకు కేంద్రం సహకరిస్తోందని పీసీసీ చీఫ్​ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దొంగసొమ్మును భాజపా, తెరాస కలిసి పంచుకుంటున్నాయని విమర్శించారు. భారీ అక్రమాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ధాన్యంపైనా భాజపా, తెరాస కలిసి నాటకాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు.

Revanth Reddy
Revanth Reddy

By

Published : Mar 22, 2022, 3:23 PM IST

Revanth Reddy on KCR: సింగరేణి టెండర్లలో భారీగా అక్రమాలు జరిగాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు సంబంధించిన వారికే కాంట్రాక్టులు దక్కాయన్నారు. అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినా... ఎలాంటి ఫలితం లేదని పేర్కొన్నారు. 8 ఏళ్లుగా పదవిలో ఉన్న సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ఎందుకు తొలగించట్లేదని ప్రశ్నించారు. దిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

దొంగసొమ్మును కలిసి పంచుకుంటున్నాయి

కేసీఆర్‌ సంబంధించిన వారికే సింగరేణి కాంట్రాక్టులు దక్కాయని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రూ.50 వేల కోట్ల కాంట్రాక్టును ఒక సంస్థకు అక్రమంగా ఇచ్చారని అన్నారు. 49 శాతం వాటా ఉన్న కేంద్రం అక్రమాలను పట్టించుకోవట్లేదని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వ అక్రమాలకు కేంద్రం సహకరిస్తోందని చెప్పారు. దొంగసొమ్మును భాజపా, తెరాస కలిసి పంచుకుంటున్నాయని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే...

భారీ అక్రమాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తమ ఫిర్యాదులపై స్పందించకపోతే... సుప్రీంకోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. నిబంధనలు కఠినతరం చేసి ఒక్క సంస్థే టెండర్లలో పాల్గొనేలా చేశారని తెలిపారు. కేసీఆర్‌ దోపిడీని కేంద్రంలోని భాజపా సమర్థిస్తోందని రేవంత్​ రెడ్డి ఆరోపించారు.

ఆ పోరాటమంతా బూటకమే...

'తెరాసపై భాజపా చెప్తున్న పోరాటమంతా బూటకమే. ధాన్యంపైనా భాజపా, తెరాస కలిసి నాటకాలు ఆడుతున్నాయి. భాజపాకు నిధులు సమకూరుస్తున్నదే తెరాస ప్రభుత్వం. అమిత్‌ షా, కేసీఆర్‌, అసదుద్దిన్‌ ఓవైసీ కలసి నాటకాలు ఆడుతున్నారు.'- రేవంత్‌ రెడ్డి, పీసీసీ చీఫ్​

కేసీఆర్‌ ప్రభుత్వ అక్రమాలకు కేంద్రం సహకరిస్తోంది: రేవంత్‌ రెడ్డి

ఇదీ చదవండి :రేవంత్ నాకు ఝలక్ ఇవ్వడం కాదు.. నేనే ఇస్తా

ABOUT THE AUTHOR

...view details