AP Capital:ఏపీరాజధాని అమరావతి పేరుతో బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రొవిజన్ పెట్టింది. అమరావతినే రాజధానిగా పేర్కొంటూ.. ప్రాథమికంగా లక్ష రూపాయలు కేటాయించింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అమరావతిలో సచివాలయం, ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి నిధులు కేటాయించింది.
సచివాలయ నిర్మాణానికి రూ.1,214 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్‌కు రూ.1,126 కోట్లు, దానికి సంబంధించిన భూసేకరణకు రూ. 21 కోట్లు అవసరమని లెక్కగట్టింది. ఈ భూసేకరణకు రూ.18.3 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.