తెలంగాణ

telangana

ETV Bharat / city

సీసీఎంబీ పరిశోధన: పుట్టగొడుగులతో కరోనాకు చెక్‌

కరోనా వైరస్‌ని మట్టుబెట్టే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఔషధాలు, టీకాల తయారీలో ఒక్కో ప్రయోగం ఒక్కో ఫలితాన్నిస్తున్న వేళ.. భారత్‌లో తొలిసారిగా ఓ యాంటీ వైరల్‌ ఔషధ ఆహారంపై ప్రయోగం సఫలమైంది. పుట్టగొడుగుల నుంచి తయారుచేసిన ఈ పూరకాహార(ఫుడ్‌ సప్లిమెంట్‌) తయారీకి హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) వేదికైంది.

ccmb research says that mushrooms can cure covid 19
పుట్టగొడుగులతో కరోనాకు చెక్‌

By

Published : Oct 20, 2020, 6:50 AM IST

పుట్టగొడుగుల్లో యాంటీ యాక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. వీటిలోని బీటా గ్లూకాన్స్‌ యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇప్పుడు కరోనా వైరస్‌ నివారణ ఔషధాల తయారీకి సమయం పడుతుండటంతో మహమ్మారికి తక్షణ విరుగుడుగా ఫుడ్‌ సప్లిమెంట్‌ను రూపొందించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలో అటల్‌ ఇంక్యుబేషన్‌లోని అంకుర సంస్థ క్లోన్‌ డీల్స్‌, సీసీఎంబీతో సంయుక్త పరిశోధనలు చేసింది. ప్రముఖ ఔషధ ఆహార ఉత్పత్తి సంస్థ ఆంబ్రోషియా ఫుడ్‌ ఫామ్‌తో కలిసి సప్లిమెంటును అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయోగాలు చేసింది. పుట్టగొడుగుల్లోని కార్డిసెప్స్‌, కర్కమిన్‌తో కలిసి ద్రవ రూపంలో ఈ ఆహారం అందుబాటులోకి రానుంది.

పసుపు మిశ్రమంతో కలిసి కరోనా వైరస్‌ను ఎదుర్కోవటంలో కీలకపాత్ర పోషించనుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపర్చడం, యాంటీ ఆక్సిడెంట్‌గా రోగనిరోధక శక్తి పెంచేందుకు ఇది దోహదపడుతుంది. ఇప్పటికే ఎయిమ్స్‌ దీన్ని క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉపయోగిస్తోంది. దీని పనితీరుపై ఎయిమ్స్‌ నాగ్‌పుర్‌, భోపాల్‌, నవీ ముంబయి కేంద్రాల్లో ప్రయోగాలు కొనసాగుతున్నాయి. కొవిడ్‌-19ను ఎదుర్కోవడంలో ఇది సమర్థంగా పనిచేస్తుందని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఇది మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details